Friday, November 22, 2024

గ్రామాల్లో నిధులు లేక స‌ర్పంచ్ ల‌ పరేషాన్..

నిజామాబాద్ ఏప్రిల్ (ప్రభ న్యూస్) : గ్రామాలలో సంవత్సరాల నుండి నిధులు లేక సర్పంచులు పరేషాన్ అవుతున్నామని.. నిధులేమో అసలే ఇవ్వడం లేదు.. ఉన్న నిధులు కాస్తా ఫ్రీజింగ్ చేస్తున్నారని, పెండింగ్ నిధులు విడుదల చేసి సర్పంచుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సర్పంచుల ఫోరం అధ్యక్షులు అసోల్ల శ్రీనివాస్ కోరారు. గురువారం సర్పంచ్ ల ఫోరం ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని కలెక్టరేట్ కు తరలి వచ్చారు. సర్పంచ్ సమస్యలపై జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడారు. గ్రామ పంచాయతీలకు రాజ్యంగ పరంగా, ఫైనాన్స్ కమీషన్స్ ప్రకారం ఎన్ని నిధులు రావాలో అన్ని నిధులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 2019- 2020లో వచ్చిన నీధులతో పోలిస్తే 2020-2021, 2021- 22 2022-23 వరకు 60% మాత్రమే నిధులు వస్తున్నా యనీ తెలిపారు. గ్రామ పంచాయతీకి సకాలంలో CFCకానీ, SFC కానీ నిధులు రాకపో వడం. నిధులు ఫ్రీజింగ్ సమస్య అంటే మేము అందజేసిన చెక్కులు దాదాపు ఆరు నెలలైనా చెక్కులు పాస్ కాకపోవడం, అధికారుల ఒత్తిడితో సర్పంచులందరూ తెలంగాణ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేశాం. ఇందుకు సంబంధించిన బిల్లులు ఇప్పటివరకు రాలేదని పేర్కొన్నారు . గ్రామ పంచాయతికి వచ్చిన నిధులు
కరెంటు బిల్లులు కట్టుటకు.. కార్మికుల జీతాలు చెల్లించుటకు, ట్రాక్టర్ ఈఎంఐ ఐ చెల్లించుటకు, ట్రాక్టర్ నిర్వహణ, డిజిల్ పోయించుటకు.. తదితర వాటన్నింటిని చెల్లించగా గ్రామంలో హారితహారం ప్రోగ్రాంలో చెట్లకు ట్రీ గార్డులు, కట్టెలకు నిధులు సరిపోవట్లేదనీ పేర్కొన్నారు.

క్యాపిటల్ వర్క్ ఏది చెద్దాం అన్న ఒక్క రూపాయి ఉండడం లేదనివాపోయారు. గ్రామ పంచా యతీలకు ప్రత్యేక నిధులు ఇచ్చి గ్రామాలలో క్యాపిటల్ వర్క్ చేయడానికి సహకరిం చాలని తెలిపారు. కరెంట్ బిల్లులు ప్రభుత్వమే చెల్లించాలని, పాఠశాల నిర్మాణం గ్రామపంచాయతీ పరిధిలో నుండి అంచులపై అధికారుల పెత్తనం ఉండకూడదని ఉపసర్పంచ్ లకు చెక్ పవర్ రద్దు చేయాలని ఎస్ఎస్సి నిధులు ఉన్నా కూడా చెక్కులు జనరేట్ కాకపోవడం సమస్యగా మారిందని పేర్కొన్నారు. సకాలంలో నిధులు రాక గ్రామంలో మౌలిక వసతులు కల్పించడంలో సర్పంచులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి మే 1వ తేదీ లోపల పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేసి సర్పంచుల సమస్యలపై పరిష్కరించని ఎడల మే 1 నుంచి పెద్ద ఎత్తున కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో ఫోరం ఉపాధ్యక్షులు రాజారెడ్డి పోశెట్టి సత్తిబాబు, జనరల్ సెక్రెటరీ ఎడ్ల రాజేశ్వర్ రెడ్డి, సెక్రటరీలు శంకర్ గౌడ్, తోట శంకర్ సత్యనారాయణ, 27 మండలాల సర్పంచులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement