హైదరాబాద్, ప్రభన్యూస్: బుద్ధి మాంద్యం, అంగ వైకల్యం ఉండి సొంతంగా పనులు చేసుకోలేని వారి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన భవిత కేంద్రాలకు భరోసా కరువైం ది. నాలుగేళ్లుగా నిధులు అందకపోవడంతో భవిత కేంద్రాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఈ కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఐదు వందల వరకు ఉంటాయి. వీటి ద్వారానే బుద్ధి మాంద్యం, అంగవైకల్యం కలిగిన పిల్లలను గుర్తించి వారిని భవిత కేంద్రాలకు తీసుకురావాల్సి ఉంటుంది.
ఈ కేంద్రాల్లో రెండేళ్ల పాటు వారికి విద్యా బుద్దులు నేర్పడం, ఇతరులు మాట్లాడిన అంశాలను అర్థం చేసుకునే విధంగా తీర్చిదిద్ది.. చివరికి సాధారణ విద్యా ర్థులుగా మార్చాల్సి ఉంటుంది. ఆ తర్వాత సాధారణ స్థితికి వచ్చాక రెగ్యులర్ పాఠశాల లకు పంపాల్సి ఉంటుంది. కానీ భవిత కేంద్రాలే సక్రమంగా నడవకపోవడంతో పాఠశాలలకు వెళ్లే పరిస్థిితి లేకుండా పోయింది. అయితే ప్రభుత్వం నుంచి సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో భవిత కేంద్రాల పనితీరులో మెరుగుదల కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
భవిత కేంద్రాలకు వచ్చే పిల్లల కోసం ఒక్కొక్కరికి నెలకు రూ.350 రవాణా చార్జీలు ఇవ్వాల్సి ఉంటుంది. గత నాలుగేళ్లుగా ప్రభుత్వం ట్రాన్స్‌ఫోర్ట్ చార్జీలను విడుదల చేయడం లేదు. దీంతో భవిత కేంద్రాలకు పంపించేందుకు డబ్బులు లేక బాధిత కుటుంబ సభ్యు లు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో విద్యార్థిపై దాదాపుగా రూ.10 వేల ఖర్చు అవుతుంది. కానీ నిధుల కొరత కారణంగా పిల్లలకు పరికరాలను అంది ంచకపోవడంతో భవిత కేంద్రాల భవిత ఆగమ్య గోచరంగా మారిందని వాదన వినిపిస్తోంది.
లోలోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..