Sunday, September 22, 2024

TG: చెలరేగుతున్న లంచావతారాలు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో అదేప‌ని.. కేటీఆర్

కార‌ణం లేకుండా ఫైళ్ల‌ను ఆపేస్తున్నారు
ఎందుకు తొక్కిపెడుతున్నారో చెప్పాలి
పార‌ద‌ర్శ‌క‌త లేని సీఎం రేవంత్ పాల‌న‌
పెద్ద‌ల‌కు అమ్యామ్యాల కోస‌మే సామాన్యుల‌కు తిప్ప‌లు
ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన కేటీఆర్‌


ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే లంచావతారాలు చెలరేగుతున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. సాక్షాత్తూ సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న మున్సిపల్ శాఖ పరిధిలోని హెచ్ఎండీఏలో భారీ ఎత్తున పేరుకుపోతున్న ఫైళ్లు దేనికి సంకేతం అంటూ ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు. కారణాలు లేకుండా ఫైళ్లను అధికారులు తమవద్దే ఎందుకు తొక్కిపెడుతున్నారని నిలదీశారు.

దీని వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో ప్రజలు తెలుసుకోవాలన్నారు. అనుమతుల్లో అవినీతిని నిరోధించేందుకు కేసీఆర్ ప్రభుత్వం టీఎస్-బీపాస్ తెచ్చిందని చెప్పారు. అంతటి పారదర్శక విధానాన్ని కూడా రేవంత్ సర్కారు తుంగలో తొక్కి విచ్చలవిడి అవినీతిని ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ పెద్దలకు అమ్యామ్యాల కోసమే కాంగ్రెస్‌ సర్కార్‌ సామాన్య ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement