Thursday, January 9, 2025

RR | కమిషనర్‌ పై కాంగ్రెస్ నేతల దూషణ.. పారిశుధ్య కార్మికుల నిరసన..

కాంగ్రెస్ నేత దుర్భాషపై ఆగ్రహం
క్షమాపణ చెప్పాలని డిమాండ్
తాండూరు : కాంగ్రెస్ పార్టీ నేత మున్సిపల్ కమిషనర్ ను అసభ్యంగా దూషించారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు హాబీబ్ లాల సోమవారం మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహా రెడ్డికి ఫోన్ చేశారు. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదని మరొకరికి ఫోన్ చేసి కమిషనర్ గురించి అసభ్యంగా మాట్లాడారు. సామాజిక మాధ్యమంలో ఈ వీడియో వైరల్ గా మారింది.

ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ కార్మికులు ఇవాళ ఉదయం విధులు బహిష్కరించి కార్యాలయం ముందు బైఠాయించారు. కాంగ్రెస్ నేతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హబీబ్ లాల కమిషనర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, కౌన్సిలర్ సోమశేఖర్ తదితరులు వచ్చి కార్మికులతో మాట్లాడారు. విషయాన్ని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

కమిషనర్, హాబీబ్ లాల మద్య వివాదాన్ని పరిష్కరిస్తానని హామి ఇచ్చారు. దీంతో కార్మికులు శాంతించారు. కాంగ్రెస్‌ నేత హబీబ్‌ లాలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అదేవిధంగా కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి మాట్లాడుతూ… ఫోన్ లేపలేదని అసభ్యంగా మాట్లాడడం తగదన్నారు. పని ఒత్తిడి, కార్యక్రమాలు, సమావేశాల్లో ఉన్నప్పుడు ఫోన్ ఎత్తే పరిస్థితి ఉండదన్నారు. అలాంటి సందర్భాల్లో దూషించడం పద్ధతి కాదన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, కార్మికులు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement