బంటారం (ప్రభా న్యూస్): భార్య భర్తల మధ్య గొడవతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా బంటారం మండలం బొపునారం గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. బొపునారం గ్రామానికి చెందిన అయినెల్లి జనార్ధన్ (30) తరచూ భార్యతో గొడవపడేవాడు. దీంతో ఈ మధ్యనే భార్య పుట్టింటికి వెళ్తింది. మనస్తాపానికి గురైన జనార్ధన్ శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం అది గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. మృతునికి కూతురు ఉంది. భార్య గాయత్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement