Saturday, November 2, 2024

TG | వర్గీకరణ చేసే వరకు యుద్ధం ఆగ‌దు.. మంద కృష్ణ

జన్నారం, నవంబర్ 2( ఆంధ్రప్రభ) : ఎస్సీ వర్గీకరణ చేసే వరకు ప్రభుత్వంపై ధర్మయుద్ధం చేస్తామని ఎం.ఆర్.పి.ఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ధర్మ యుద్ధ సదస్సు మండల కేంద్రంలోని జ్యోతి ఫంక్షన్ హాలులో శనివారం నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా హాజరైన ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాటిచ్చి తప్పారన్నారు. మాటలతో మభ్యపెడుతున్నారని, వర్గీకరణ పూర్తయ్యే వరకు రాష్ట్ర ఉద్యోగ నియమకాలు నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.

30ఎండ్లుగా ఎన్నో ఉద్యమాలు చేసిన ఫలితంగా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకోవచ్చని తీర్పు ఇచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు చెన్నూరి సమ్మయ్య మాదిగ, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు అరెల్లి మల్లేష్ మాదిగ, ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షలు కొండ బ్రహ్మయ్య మాదిగ, నిర్మల్ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి శ్రీనివాస్ మాదిగ, మండల అధ్యక్షుడు కొండుకూరి ప్రభుదాస్ మాదిగ, ప్రధాన కార్యదర్శి జంగం రవి మాదిగ, ప్రచార కార్యదర్శి ముల్కాల రమేష్ మాదిగ, సీనియర్ నాయకులు మంద చిన్నయ్య మాదిగ, మామిడిపల్లి ఇందయ్య మాదిగ, దుమ్మల ఎల్లయ్య మాదిగ, దూమల్ల రమేష్ మాదిగ, మంద రాజేష్, శ్రీపల్లి అంజన్న మాదిగ, కొండుకూరి ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement