Saturday, November 30, 2024

KNR | చిన్నారిని చిదిమేసిన వాహ‌నం ట్రాలీ

వాహనం టైరు కింద పడి ఏడాది పాప మృతి
సుల్తానాబాద్‌, నవంబర్‌ 30 (ఆంధ్రప్రభ): ఓ వాహ‌నం ట్రాలీ చిన్నారి నవ్వులను చిదిమేసింది. వాహనం టైరు కింద పడి చిన్నారి అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో రోడ్డుపై ఆడుతున్న పాప క్షణాల్లో అనంత లోకాలకు వెళ్లిపోయింది. రోజు మాదిరిగానే ఉదయం లేచిన చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటుండగా ప్రక్కనే ఉన్న ట్రాలీని రివర్స్‌ తీస్తుండగా ప్రమాదవశాత్తు దాని టైర్ల కింద పడి రఫీనా అనే ఏడాది పాప అక్కడికక్కడే మృతి చెందింది.

ఉదయం లేచి ఆడుకుంటున్న పాప ఒక్కసారిగా మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పొట్టకూటి కోసం పాప తండ్రి రాజ్‌ మహ్మద్‌ దుబాయిలో జీవనం కొనసాగిస్తుండగా, రోజులాగే తల్లి ఖరీదా ఇంట్లో పనిచేసుకుంటుంది. రఫీనా ఇంటిముందు ఆడుతుండగా, ఇంటి దగ్గరలో ఉండే షకీల్‌ అనే వ్యక్తి తన వాహ‌నం ట్రాలీ వెనుకకు తీసే క్రమంలో ఆడుకుంటున్న పాపను చూడకుండా వాహనం పైనుంచి నడపడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పోస్ట్‌ మార్టం నిమిత్తం మృతదేహాన్ని సుల్తానాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాన్నోస్తారు లే అమ్మ.. అని తల్లి రోదిస్తున్న తీరు స్థానికులను కలిచి వేసింది. ఆసుపత్రి వద్ద బంధువుల రొదనలు మిన్నంటాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రావణ్‌ కుమార్‌ తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement