Friday, November 22, 2024

Breaking | బాలుడిని ఢీకొట్టిన ద్విచ‌క్ర వాహ‌నం.. ప‌రిస్థితి విష‌మం

వాజేడు (ప్రభ న్యూస్): ద్విచక్ర వాహనం ఢీకొని బాలుడికి తీవ్ర గాయాలు అయిన ఘటన ములుగు జిల్లాలో జ‌రిగింది. వాజేడు మండలంలో ఆదివారం ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. జగన్నాధపురం చర్చి సమీపంలో జాతీయ రహదారిపై నడిచి వెళుతున్న వాజేడు గ్రామానికి చెందిన చిడం పెళ్లి రోహిత్(14) ను గుర్తు తెలియని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో తలకు, కుడి కాలుకు తీవ్ర గాయాలు అయ్యాయి.

తీవ్ర రక్తస్రావం కావడంతో గమనించిన స్థానికులు హుటా హుటిన వాజేడు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి వైద్యులు ప్రధమశిక్షణ నిర్వహించి మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. బాలుడికి బ్లడ్ వామిటింగ్స్‌, చెవిలో నుండి బ్లడ్ బ‌య‌టికి వ‌స్తుండ‌డంతో అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. తల్లిదండ్రులు బంధువులు విలపిస్తున్నారు. ఢీకొట్టిన ద్విచక్ర వాహనం దానిని నడిపిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement