Saturday, November 23, 2024

టీఆర్ఎస్ నేతల గ్రామాల్లోనూ ఈటల జోరు

హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆది నుంచి ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. 14 రౌండ్ల ఫలితాలు పూర్తి కాగా.. కేవలం రెండు రౌండ్లలో మాత్రమే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధిక్యం క‌న‌బ‌రిచారు. మిగతా 12 రౌండ్లలో ఈటల రాజేందర్‌ స్పష్టమైన ఆధిక్యం చూపారు. 14 రౌండ్ల ఫలితాలు ముగిసే సరికి ఈటల రాజేందర్ 9,434 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

అయితే టీఆర్ఎస్ నేతల గ్రామాల్లోనూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం సంపాదించడం గమనార్హం. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ సొంతూరు హిమ్మత్ నగర్, టీఆర్ఎస్ సీనియర్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతారావు స్వగ్రామం సింగపూర్, మంత్రి హరీష్ రావు దత్తత గ్రామం మామిడిపల్లిలో బీజేపీకి లీడ్ వచ్చింది. సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రారంభించిన శాలపల్లిలోనూ ఓటర్లు కమలం పార్టీ ఆదరించారు. టీఆర్ఎస్ నేతల గ్రామాల్లోనూ ప్రజలు తమను ఆదరించడం పట్ల బీజేపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement