Monday, December 2, 2024

ADB | ఏటీఎం చోరీకి ప్రయత్నించిన దొంగ అరెస్ట్..

నిర్మల్ ప్రతినిధి, నవంబర్ 2 (ఆంధ్రప్రభ) : నిర్మల్ జిల్లా కేంద్రంలోని డాక్టర్స్ లైన్ లో గల కెనరా బ్యాంక్ ఏటీఎం దొంగతనానికి యత్నించిన వ్యక్తిని పట్టణ పోలీసులు శనివారం తెల్లవారుజామున పట్టుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి బ్యాంక్ ఏటీఎంలో దొంగతనానికి యత్నిస్తున్నట్లు మేనేజర్ డయల్ 100 కు ఫిర్యాదు చేశాడు.

వెంటనే పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ వెళ్లి సీసీటీవీ పరిశీలించాడు. బస్ స్టాండ్ సమీపంలో వెల్మల్ బొప్పరం గ్రామానికి చెందిన కుంచం గంగాధర్ గా గుర్తించి అరెస్ట్ చేశారు. డయల్ 100 కాల్ కు కి తక్షణమే స్పందించి చాకచక్యంగా దొంగను పట్టుకొన్న ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ ను జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రశంసించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement