Friday, November 22, 2024

గిరిజనుల సంక్షేమానికి తెలంగాణ ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది : మంత్రి సత్యవతి

గిరిజనుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంద‌ని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఇందులో భాగంగానే బడ్జెట్లో గిరిజన ఆవాసాలకు లింకురోడ్ల కోసం 1000 కోట్ల రూపాయలు, గిరిజన గ్రామపంచాయతీ భవనాల నిర్మాణానికి 600 కోట్ల రూపాయలు, డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం 1700 కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పారు. మేడ్చల్ మండలం సోమారం గ్రామంలో 4 కోట్ల 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న బాలికల గురుకుల పాఠశాల భవనానికి మంత్రి చామకూర మల్లారెడ్డితో కలిసి సత్యవతి రాథోడ్ ఇవ్వాల (గురువారం) శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ.. గత ఏడాది 2కోట్ల 20 లక్షల రూపాయలతో పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ఏర్పాటు చేసుకున్నామన్నారు.

ఈ రోజు బాలికల గురుకుల పాఠశాల భవనానికి శంకుస్థాపన సందర్భంగా.. మంత్రి మల్లారెడ్డి అడిగినట్లు బంజారా భవన్‌కు కోటిన్నర రూపాయలు, ఆశ్రమ పాఠశాల భవనానికి 3 కోట్ల రూపాయలు, నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన 8 గ్రామపంచాయతీల భవన నిర్మాణానికి 2 కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్న‌ట్టు చెప్పడానికి సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ వచ్చిన ఏడేండ్లలో రాష్ట్రంలో 1000 గురుకులాలను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల కోసం ఏర్పాటు చేయడం అంటే విద్యపట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement