Friday, November 22, 2024

సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల పోస్టుల్లో మాజీ ఆర్మీ వైద్యులకు ప్రత్యేక కోటా.. నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ :తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖలో శాశ్వత ప్రాతిపదికన ప్రజారోగ్యశాఖ విభాగంలో త్వరలో భర్తీ చేయనున్న సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల పోస్టుల్లో రాష్ట్ర ప్రభుత్వం మాజీ సైనిక వైద్యులకు ప్రత్యేకం రిజర్వరేషన్‌ను కల్పించింది. ఎక్స్‌ సర్వీస్‌ మెన్‌ కోటా కింద 2శాతం పోస్టులను సైన్యంలో తాత్కాలిక పద్దతిలొ పనిచేసిన మాజీ ఆర్మీ వైద్యులకు కేటాయించింది. ఈ మేరకు రోస్టర్‌ పాయింట్లను వైద్య, ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసింది.

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో భారత దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి దేశ సరిహద్దుల్లో 7 సంవత్సరాలకు పైగా విధులు నిర్వహించి, నిరుద్యోగులుగా మారిన తెలంగాణ ఆర్మీ వైద్యులకు ఎంతో మేలు జరగనుంది. ఆర్మీ వైద్యులకు సముచిత గౌరవం కల్పించడమే కాకుండా యువ వైద్యుల్లో దేశ భక్తిని పెంపొందించి సరిహద్దుల్లో వారు సైతం పనిచేసేలా ప్రభుత్వం నిర్ణయం ఉందని తెలంగాణ పబ్లిక్‌ హెల్త్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ వ్యవస్తాపక అధ్యక్షులు కత్తి జనార్థన్‌ కొనియాడారు. నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌తోపాటు వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి హరీష్‌రావుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement