రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను, క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం (ఫిబ్రవరి17) సందర్భంగా ఎల్బీ స్టేడియంలో జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. జాతీయస్థాయి క్రీడాకారులను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించడంలేని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. దేశంలోని క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహం కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ స్థాయి క్రీడలను ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోని అనేక దేశాలు క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నాయన్నారు. క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉండి ప్రోత్సహిస్తుందని మంత్రి తెలిపారు.
వాలీబాల్ పోటీల్లో విజేతలకు మొదటి బహుమతి రూ. లక్ష, రెండో విజేత కు రూ.50 వేలు, తృతీయ విజేతకు రూ.25 వేలు నగదు బహుమతులను తన వ్యక్తిగతంగా అందజేస్తానని మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రకటించి నిర్వాహకులకు అందజేశారు. ఈ పోటీలను ఏర్పాటు చేసిన నిర్వాహకులను మంత్రి అభినందించారు. మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ తో కలిసి బాలీబాల్ ఆడి క్రీడాకారులను ఉత్తేజ పరిచారు. ఈ కార్యక్రమంలో బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్, నాంపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి ఆనంద్ గౌడ్, నిర్వాహకులు రాజీవ్ సాగర్, నవీన్ చారి తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital