Friday, November 22, 2024

Sirisilla: మూడో రోజుకి చేరిన సిరిసిల్ల వ‌స్త్ర ప‌రిశ్ర‌మ బంద్ ..

సిరిసిల్ల జిల్లా: సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ బంద్‌ మూడో రోజు కొనసాగుతోంది. పవర్ లూమ్ సాంచాలు మూగబోయాయి. పాలిస్టర్‌ పరిశ్రమ బంద్‌తో సుమారు 20వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. పాలిస్టర్‌కు మార్కెట్‌లో డిమాండ్ లేకపోవడం దేశవ్యాప్తంగా సంక్షోభం నెలకొంది. ఇప్పటికే సిరిసిల్ల మిల్లుల్లో రూ.35 కోట్ల పాలిస్టర్ బట్ట పేరుకుపోయింది. కార్ఖానాల్లోనే ఉత్పత్తి చేసిన బట్ట నిల్వలు ఉండటంతో కొత్త బట్ట ఉత్పత్తి చేయొద్దని సిరిసిల్ల మ్యానుప్యాక్చరర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్ణయించింది.

పేరుకుపోయిన పాలిస్ట‌ర్ వ‌స్త్రాల‌ను కొనుగోలు చేయ‌డంతో పాటు తిరిగి ప‌వ‌ర్ లూమ్ మ‌గ్గాలు ప‌ని చేసేందుకు అవ‌స‌ర‌మైన ఆర్డ‌ర్ లు ఇవ్వాలంటూ ఇక్క‌డి 20వేల మంది నేత కార్మికులు స‌మ్మెబాట ప‌ట్టారు.. గ‌త మూడు రోజులుగా బంద్ పాటిస్తూ నిర‌న‌స కొన‌సాగిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అండగా నిలవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాగా, చేనేత, జౌళీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సమస్యపై దృష్టి సారించారు. ఆర్వీఎం బట్టల ఉత్పత్తి ఆర్డర్లను మ్యాక్స్, ఎస్ఎస్ఐ యూనిట్లకు అప్పగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement