తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం రెండవ విడత అమలు కోసం ఎన్సీడీసీ రూ.4563 కోట్ల రుణం మంజూరు చేసిందన్నారు. గొర్రెల కొనుగోలు నుండి లబ్ధిదారుడి ఇంటికి చేరేవరకు మొత్తం ప్రక్రియను వీడియో చిత్రీకరణ చేసి ఎంతో పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఎలాంటి అవినీతి జరగకుండా సాంకేతికతను వినియోగిస్తుమన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు.
చనిపోయిన గొర్రెలకు వెంటనే బీమా క్లెయిమ్ అమలు జరిగేలా చూడాలన్నారు. పలు జిల్లాల్లో గొర్రెల మార్కెట్ల ఏర్పాటు కోసం భూమి కేటాయించి, నిధులను మంజారు చేయడం జరిగిందని, ఆ పనులను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి తలసాని ఆదేశించారు. ప్రస్తుత వర్షాకాల సీజన్ నేపథ్యంలో జీవాలు వ్యాధుల బారీన పడకుండా ముందస్తు చర్యలను చేపట్టాలన్నారు. అన్ని పశు వైద్యశాలల్లో మందులను అందుబాటులో ఉంచాలన్నారు. నట్టల మందులు సక్రమంగా వేసేలా చూడాలన్నారు. ఇప్పటి వరకు 1.97 కోట్ల గొర్రెలు, మేకలకు నట్లల నివారణ మందు వేశామన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.