Tuesday, November 19, 2024

Big Breaking | కేకపుట్టిస్తున్న కోకాపేట.. ఎకరా 100 కోట్లు పలికిన ధర

కోకాపేటలో ప్రభుత్వ భూముల వేలం బంగారు గనులను తలపిస్తోంది. కోకా పేట భూములు కేకపుట్టిస్తున్నాయి. నియో పోలిస్ రెండో విడత భూముల వేలం తెలంగాణ సర్కార్‌కు కాసుల పంట పండిస్తోంది. ఇవ్వాల (గురువారం) హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో కోకాపేట భూముల వేలం కొనసాగుతోంది. 10వ నెంబర్​ ప్లాట్​కి సంబంధించిన వేలంలో ఎకరా 100 కోట్ల మార్క్​ని టచ్​చేసింది. ఇప్పటివరకైతే ఇదే ఆల్​టైమ్​ రికార్డు ధరగా నమోదయినట్టు తెలుస్తోంది.

ఏపీఆర్​ – రాజ్​పుష్ప మధ్య హోరాహోరీ బిడ్డింగ్​ జరిగినట్టు తెలుస్తోంది. ఇక.. 6, 7, 8, 9 ప్లాట్లకు సంబంధించిన వేలంలో 45.33 ఎకరాల్లోని ఏడు ప్లాట్లను హెచ్‌ఎండీ వేలం వేస్తోంది. ప్లాటు కనీస విస్తీర్ణం 3.9 ఎకరాల నుంచి 9.1 ఎకరాలుగా ఉంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టీసీ నిర్వహించిన ఈ వేలంలో ఆన్‌లైన్‌లో కూడా పాల్గొనే అవకాశాన్ని కల్పించారు. ఒక ఎకరానికి అప్సెట్ ధర రూ.35 కోట్లుగా అధికారులు నిర్ణయించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement