Friday, November 22, 2024

పచ్చిమిర్చికి ఘాటెక్కువ.. మార్కెట్‌లో రేటెక్కువ…

ప్రభన్యూస్ : పచ్చిమిర్చి ధర ఘాటెక్కింది. దీంతో మార్కెట్లో రేటెక్కువైంది. ఎండలు విపరీతంగా ముదరడంతో మిర్చి పంట పూత రాలుతుంది. దీంతో క్రిమి సంహారక మందులు పిచికారి చేస్తే కొంతమేరకు ఖాత వస్తుందంటున్నారు. గ్రామీణ ప్రాంత రైతులు పచ్చిమిర్చి ధర పెరిగినప్పటికీ వాతావరణం అనుకరించడం లేదని రైతులు వాపోయారు. ఎండుమిర్చి ధర 180 రూపాయలు మార్కెట్లో ఎక్కువ ధర పలికినప్పటికీ పచ్చిమిర్చి ధర కిలోకు 80 నుండి 100 రూపాయలు పలుకుతోంది. ధర పలికినా రుచిగా ఆరోగ్యపరంగా మేలు చేకూరుతుందని వైద్యులు సూచిస్తున్నారు. పచ్చిమిర్చిని ఉడకబెట్టి అన్ని రకాల కూరల్లో వంటకాల్లో వాడుకోవచ్చని అది రుచిగా ఉంటుందని వెళ్లడించారు.

అన్ని రకాల వంటకాల్లో సన్నరకం వచ్చి మిర్చిని జోకర్‌గా వాడుకుంటున్నారు. దీంతో మార్కెట్‌లో రేటు హెచ్చు పెరుగుతుంది. మండలంలోని కంసాన్‌పల్లి, పోతాన్‌పల్లి, చందాయపేట, గొల్లపల్లి, రుక్మాపూర్‌ గ్రామాల్లో మిర్చి పంట సాగుపై మక్కువ చూపుతున్నారు. దొడ్డురకం మిర్చిని హోటళ్లలో విందు వినోదాల్లో ఎక్కువగా వాడుతుంటారు. కొంత మంది రైతులు లేత దశలోనే మార్కెట్‌లో విక్రయిస్తుండడంతో చేదుగా ఉంటుంది. లేద గోధుమరంగులోకి కాయమారిన తర్వాత మార్కెట్‌కు తరలిస్తే రుచిగా ఆరోగ్యకరంగా ఉంటుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement