హైదరాబాద్, ఆంధ్రప్రభ: సమైఖ్య పాలనలో వెలవెలబోయిన చెవరులు సీఎం కేసీఆర్ పాలనలో జలకళను సంతరించుకున్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నాయకతంలో అమలు చేసిన మిషన్ కాకతీయతో చెరువులు నిండు కుండల్లా మారాయని దాంతో మత్స్య సంపద పెరిగిందన్నారు. ‘ చెరువు నిండుగా నీరు మత్స్యకారులకు సిరులు’ అని వ్యాఖ్యానించారు. ఈమేరకు శనివారం వరంగల్ జిల్లా కటాక్షపూర్ చెరువులో మత్స్య సంపద ఫోటోలను షేర్ చేస్తూ టీట్ చేశారు. కటాక్షపూర్ చెరువులో పట్టిన చేపలను మత్స్యకారులు ట్రాక్టర్ నిండా లోడ్ చేసిన ఫోటోను ట్యాగ్ చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..