- రూ.17.6 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం
- 24 గంటల్లో నిందితుడిని పట్టివేత
- ఎస్పీ రాంనాథ్ కేకన్
ఆంధ్రప్రభ స్మార్ట్, నర్సింహులపేట : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలోని జరిగిన చోరీకి సంబంధించిన నిందితుడిని 24 గంటల్లో మహబూబాబాద్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ.17.6 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతోపాటు నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రాంనాథ్ కేకన్ వెల్లడించారు.
సంఘటన వివరాలు…
నర్సింహులపేట లో ఎరనాగి సీతారాములు ఇంటికి తాళం వేయగా ఎవరు లేని సమయంలో అదే గ్రామానికి చెందిన కోటగిరి రవి దొంగతనానికి పాల్పడి బంగారు ఆభరణాలు, వెండి, నగదును చోరీ చేశాడు. అనేక కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు కోటగిరి రవిని విచారించారు. దీంతో నేరం అంగీకరించి చోరీ సొత్తు మొత్తాన్ని పోలీసులకు అందజేశాడు. 24 గంటల్లో కేసును ఛేదించి నిందితున్ని పట్టుకొని రికవరీ చేసిన సీసీఎస్ సీఐ హతిరాం, ఎస్ఐ తహర్ బాబా, స్థానిక ఎస్సై సురేష్ ను జిల్లా ఎస్పీ కేకన్ అభినందించి రివార్డులను అందజేశారు.