Monday, November 25, 2024

తగ్గేదెలే అంటే తాట తీస్తాం.. రౌడీషీట‌ర్ల తీరు మారకుంటే పీడీ యాక్ట్ త‌ప్ప‌దు

వరంగల్ క్రైమ్, (ప్రభ న్యూస్): రౌడీషీటర్లు త‌మ తీరు మార్చు కోకుండ తగ్గదేలే అంటే, ఇక నుండి తాటతీస్తామని వరంగల్ టాస్క్ ఫోర్స్ ఇన్‌చార్జి, అడిషనల్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ అన్నారు. పోలీసుల కళ్లుగప్పి చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో తలదూరిస్తే ఇక పీడీ యాక్ట్ ప్రయోగిస్తామన్నారు. ఓరుగల్లును అన్ని రంగాల్లో ప్రగతిపథంలో నిలిపేందుకే నేరరహిత నగర నిర్మాణ లక్ష్యంగా పని చేస్తున్నట్టు వైభవ్ గైక్వాడ్ స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ట్రై సిటీ పరిధిలోని 60 మంది రౌడీ షీటర్లకు వరంగల్ టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఇవ్వాల (శ‌నివారం) కౌన్సెలింగ్ నిర్వహించారు. రౌడీషీటర్లు ధరించే దుస్తులోనే కాదు, వేషాధారణల్లో మార్పు కన్పించాలన్నారు డీసీపీ. ఇక నుండి స్థానికుల ఫీడ్ బ్యాక్ సేకరించి, తదనుగుణమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో టాస్క్ ఫొర్స్ ఇన్స్ స్పెక్టర్లు ఆర్. సంతోష్, సి హెచ్ శ్రీనివాస్, ఎస్సై లు లవణ కుమార్, ప్రేమనందమ్ పాటు టాస్క్ ఫొర్స్ హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుల్లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement