Tuesday, September 17, 2024

TS: పార్టీ మారడం లేదు… అసత్య ప్రచారాలు నమ్మొద్దు… ఎర్రబెల్లి

తాను పార్టీ మారడం లేదని… కొద్ది రోజుల నుండి సోషల్ మీడియాలో తనపై వస్తున్నటువంటి అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మకండని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ మోసపూరిత హామీలను కార్యకర్తలకు విశధీకరిస్తూ, రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు ఎలా కృషి చేయాలో ప్రణాళికలు సిద్ధం చేసుకునేందుకు ఇవాళ పర్వతగిరిలో మీటింగ్ పెట్టడం జరిగింది.

కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి మోసపూరిత హామీలు ప్రజలు ఇకనైనా తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 4000 పెన్షన్ చేస్తానని, ఇప్పటివరకు ఆ ఊసే లేదన్నారు. అదే పక్క రాష్ట్రంలో 4000 పెన్షన్ ఇస్తున్నారు, ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. ఇప్పటివరకు రైతుబంధు డబ్బులు రైతుల అకౌంట్లోకి జమ కానే లేదు, ఆరు గ్యారెంటీలు అమలు కాకపోతే ప్రజలే వారికి బుద్ధి చెప్పే రోజులు ముందున్నాయన్నారు.

కాంగ్రెస్ పార్టీ వాళ్లు సోషల్ మీడియా వేదికగా చేసుకొని తాను పార్టీ మారుతానని దుష్ప్రచారం చేస్తున్నారు, వారు ఇకనైనా ఇలాంటి దుష్ప్రచారాలు మాని ప్రజల బాగు కోసం ఆలోచించి వారికి పనిచేస్తే బాగుంటుందన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం రానుందని తెలిసి అది జీర్ణించుకోలేని కాంగ్రెస్ వాళ్లు ఇలాంటి పనికిమాలిన ప్రచారాలను చేస్తున్నారన్నారు. తాను పార్టీ మారడం లేదు.. ఈ పార్టీలోనే ఉంటూ పార్టీ పూర్వ వైభవం కోసం పని చేస్తానని, మళ్లీ కేసీఆర్ సీఎం అయ్యేంతవరకు అహర్నిశలు కృషి చేస్తానన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement