జైనూర్, నవంబర్ 30 (ఆంధ్రప్రభ) : కొమరం భీo అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని చింతకర్ర పంచాయతీలో గల తాటిగూడ ఘాట్ ప్రాంతంలో శనివారం పత్తి నింపి విక్రయానికి వెళ్తున్న వాహనం ఘాట్ లో పల్టీలుకొడుతూ పడిపోయిందని కిషన్ నాయక్ తండా గ్రామ ప్రజలు తెలిపారు.
వారు తెలిపిన వివరాల ప్రకారంగా… కిషన్ నాయక్ తండా నుండి రైతులు జాదవ్ కన్నీరామ్, విట్టల్ గిరిజన రైతుల పత్తిని విక్రయించడానికి చేరమీద తీసుకువెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని, ఆ వాహనంలో డ్రైవర్ తో పాటు నలుగురు కూలీలు ఉన్నారని తెలిపారు. ఘాట్ లో వాహనం బోల్తా పడుతున్న సమయంలో వారు వాహనం నుండి దూకడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారని తెలిపారు. గ్రామాలకు రోడ్డు లేక ఘాట్ ప్రాంతంలో రోడ్డు సరిగా లేక ప్రమాదాలు జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
- Advertisement -