అన్ని హంగులతో నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధిత ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక శాసన సభ్యులు మెతుకు ఆనంద్ తో కలసి నూతన కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించి, చేపట్టిన పనులను పరిశీలించారు. దాదాపు అన్ని పనులు పూర్తయ్యాయని, చిన్న చితక పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఏసీ లు, లిఫ్ట్ సరిగా పని చేస్తున్నాయా లేదా మరొకసారి పరిశీలించుకోవాలని తెలిపారు. ఈ సందర్బంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయ నిర్మాణపు పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ ఈఈ లాల్ సింగ్, వికారాబాద్ ఆర్డీఓ ఉపేందర్ రెడ్డి, మున్సిపల్ కమీషనర్ శరత్ చంద్ర, ఏఈ లు లక్ష్మీ నారాయణ, రాయుడు, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
అన్ని హంగులతో కలెక్టర్ కార్యాలయాన్ని సిద్ధం చేయాలి : కలెక్టర్ నిఖిల
Advertisement
తాజా వార్తలు
Advertisement