భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఘోరం జరిగింది. విజయనగరం శివారులో ఓ బైక్‌ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటన ఇవ్వాల (శనివారం) రాత్రి జరిగింది. బైక్‌పై తమ కుమారుడితో భార్యాభర్తలు వెళ్తున్నారు. వీరి బైక్‌ని లారీ ఢీకొట్టడంతో భార్యా,భర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కుమారుడిని స్వల్ప గాయాలయ్యాయి.
అయితే.. ప్రమాదం తర్వాత బాలుడి ఆక్రందనలు అక్కడున్న వారిని కలిచి వేశాయి. అమ్మా, నాన్నా మీకేం కాదు.. అంటూ బాలుడు రోదిస్తున్న తీరు అందరినీ కన్నీరు పెట్టించింది. అక్కడున్న వారిని ‘‘ప్లీజ్ అంకుల్ రక్తం తుడవండి’’ అంటూ వేడుకోవడంతో స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.