నాగార్జున సాగర్ నిడమనూరు మండల పరిధిలోని వేంపాడు సమీపంలో సాగర్ ఎడమ కాలువకు గండి పడింది. సాయంత్రం కాల్వ అడుగు భాగాన ఉన్న యూటిలో నుంచి నీరు లీకయ్యింది. దీంతో కొద్ది సేపటికే అది పెద్ద గండిలా మారింది. ఇట్లా కాల్వ కట్ట కోతకు గురై ఆ నీరంతా వృథాగా దిగువన ఉన్న పంట పొలాల్లోకి చేరుతోంది.
గండి మరింత వెడల్పు కావడంతో పెద్ద ఎత్తున నీరు సమీపంలోని మిర్యాలగూడ – హలియా ప్రధాన రహదారి పైకి వచ్చి చేరుతోంది. వాహనాల రాకపోకలకు అంతరాయంగా మారింది. ముందస్తుగా వాహనాలను మరో మార్గంలో పోలీసులు దారి మళ్లించారు. ఈ నీటితో దగ్గరలోని నర్సింహాపురంతో పాటు పలు గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉందని సమీప గ్రామాల ప్రజలు అంటున్నారు.