ఉమ్మడి మెదక్ బ్యూరో (ప్రభన్యూస్) : తెలంగాణ రాష్ట్రంలో వీరనారి చిట్యాల ఐలమ్మ కాంస్య విగ్రహ ఆవిష్కరణ సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామంలో ఈ నెల 26న జరుగనుంది. తెలంగాణలోనే మొట్టమొదటి ఎతైన ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ప్రత్యేక అతిధిగా విచేస్తున్నారు. అత్యంత్య ఎత్తైన చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటు జరుగుతుందన్న విషయం రజక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుల ద్వారా తెలుసుకున్న చాకలి ఐలమ్మ మనుమడు రామచంద్రం చిట్ కుల్ గ్రామానికి చేరుకుని విగ్రహ దాత, టీఆర్ ఎస్ రాష్ట్ర నాయకుడు, చిట్ కుల్ సర్పంచ్ నీల మధు ముదిరాజ్ ను శాలువా కప్పి సన్మానించి ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్బంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం అలుపెరుగని ధైర్యసాహసాలను ప్రదర్శించి రజాకార్ల దాష్టీకానికి ఎదురొడ్డి నిలిచి.. వెన్ను చూపకుండా పోరాడిన తెలంగాణ వీర వనిత ఐలమ్మ గొప్పతనాన్ని ప్రపంచం నలుమూలల చాటిచెప్పేలా కృషి చేస్తామన్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రం లో కెల్ల అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకే సంకల్పించాలామన్నారు. ఇందుకోసం రాష్ట్ర రజక నేతలు ఎంతో శ్రమిస్తున్నారని గుర్తుకు చేశారు.
ఇక .. ఐలమ్మ కాంస్య విగ్రహవిష్కరణకు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు రానున్నారని, వారి చేతుల మీదుగా ఈ విగ్రహావిష్కరణ జరగబోవడం సంతోషంగా ఉందని మధు అన్నారు. తెలంగాణ వీరవనిత ఐలమ్మ మనుమడు రామచంద్రంతో పాటు వారి కుటుంబ సభ్యులు శుక్రవారం చిట్కుల్ గ్రామాన్ని సందర్శించారు. కార్యక్రమంలో రజక సంఘం రాష్ట్ర కార్యదర్శి జీతయ్య, చిట్కుల్ వెంకటేశ్ , సత్తయ్య, ఆంజనేయులు సురేష్ లతో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.