సమ్మిళిత, సమగ్ర, సమికృత మోడల్ తెలంగాణ అని మంత్రి క్వలకుంట్ల తారాకరామరావు పేర్కొన్నారు. బహీర్‌బాగ్‌లో ఏర్పాటు చేసిన మీట్‌ద ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. దేశానికి దిక్సూచిగా తెలంగాణ మారిందని, దేశ తలసరి ఆదాయంలో నెంబర్‌గా ఉందన్నారు. రాష్ట్రంలో ఎలాంటి వివక్ష లేదని తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుందన్నారు. 9ఏళ్ల క్రితంతో పోలీస్తే తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు.
9ఏళ్లలో కరువులేదు, కర్ఫ్యూ లేదని, సంపద పెంచడమే కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కేటీఆర్ చెప్పారు. పేదరికంలో భారతదేశం నైజీరియాను దాటిందన్నారు. తెలంగాణ ద్వితీయ శ్రేణి పౌరులు లేరన్నారు. కర్నాటకలో 5గంటల కరెంటు కూడా ఇవ్వడం లేదని, కర్నాటక రైతులు, గద్వాల్, కొడంగల్ వచ్చి ధర్నాలు చేశారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ఐటీలో 400శాతం అభివృద్ది సాధించామని, ఐటీలో హైదరాబాద్ బెంగుళూరును మించిపోయిందన్నారు. దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ మారిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ చేసిన పాపానికి తెలంగాణ 58ఏళ్లు బాధపడ్డామని, ఇప్పుడు కాంగ్రెస్ 6గ్యారెంటీలతో మోసం చేసే ప్రయత్నం చేస్తుందన్నారు.