Saturday, November 23, 2024

ఐడియా అదిరింది.. పక్షుల ఆకలి, దప్పిక తీరుతోంది

ప్రభన్యూస్ : అంతరించి పోతున్న పక్షుల ఆకలి దప్పిక తీర్చేందుకు వేసవికాలంలో వినూత్న ఆలోచనలతో యువకులు పక్షులకు ఆకలి దప్పిక తీర్చాలని సంకల్పంతో చేపట్టిన వినూత్న ఆలోచన అదిరింది. ఊట్కూర్‌ పట్టణంలోని శ్రీకృష్ణ ఫ్రెండ్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆ కాలనీలో చెట్లకు యువకులు డబ్బారేకు తయారు చేసి అందులో పక్షులకు ఆహారం, నీళ్లు నిల్వ ఉంచుతున్నారు. మధ్యాహ్నం సమయంలో పక్షులు గుంపులు గుంపులుగా చెట్ల దగ్గరికి చేరుకొని తమ ఆకలి దప్పిక తీసుకుంటున్నాయి.

పక్షులపై యువకులు చూపిస్తున్న మమకారాన్ని పలువురు ప్రశంసించి అభినందిస్తున్నారు. శ్రీ కృష్ణా నగర్‌ యువతను ఆదర్శంగా తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు గ్రామాల్లో చేపట్టి పక్షుల ఆకలి దప్పిక వేసవికాలంలో తీర్చేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement