Tuesday, November 26, 2024

సెయింట్-గోబైన్‌కు గృహాల విభాగం ఒక గణనీయమైన అవకాశం – హేమంత్ ఖురానా

భారతదేశంలో సెయింట్ గోబైన్‌కు గృహాల విభాగం ఒక గణనీయమైన అవకాశాన్ని అందిస్తోందని సెయింట్-గోబైన్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హేమంత్ ఖురానా అన్నారు. సెయింట్-గోబైన్ – గృహాల కోసం పరిష్కారాల శ్రేణిని ఈ రోజు హైదరాబాద్‌లో ప్రారంభించింది. మైహోమ్ శ్రేణి కింద తన నవీన గృహ పరిష్కారాల శ్రేణిని లీ మెరిడియన్‌లో సెయింట్-గోబైన్ ప్రారంభించింది. ఈసంద‌ర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ…. మార్కెట్ పరిమాణం 25 బిలియన్ డాలర్లకు పైబడి ఉండడం, 8-10శాతం సిఎజిఆర్ వద్ద వృద్ధి చెందుతూ ఉండడం వల్ల ఇంకా సంభవించని భారీ పట్టణీకరణ ఈ వృద్ధి మరింత వేగంగా సాగడానికి దోహదం చేస్తుందన్నారు. మనకి పట్టణీకరణ కేవలం 32శాతం మాత్రమే జరిగిందని, ఇది చైనాలో 62శాతంగా ఉందన్నారు.

అన్నింటిక‌న్నా ప్రజలకు ఒక ఇల్లు అవసరమ‌ని, సొంతింటి అవసరాన్ని కరోనా మరింత తీవ్రతరం చేసిందన్నారు. ప్రజలు పెద్ద ఇళ్ళను కొనుగోలు చేస్తున్నారని, తమ ఇళ్ళ మీద ఎక్కువగా ఖర్చు చేస్తున్నారన్నారు. త‌మ గృహ పరిష్కారాల పోర్ట్‌ పోలియోని పెంచడానికి త‌మ ప్రయత్నాలను తీవ్రతరం చేస్తున్నామ‌న్నారు. అలాగే భారీ క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా గృహ యజమానుల ముంగిటికే ఈ పరిష్కారాలను తీసుకువెళ్తున్నామ‌న్నారు. ఒక అద్భుతమైన టచ్-అండ్-ఫీల్ అనుభవాన్ని అందించడం కోసం దేశంలోని ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నగరాల్లో 2021 చివరికల్లా 50 ప్ల‌స్ మైహోమ్ స్టోర్స్ ప్రారంభిస్తున్నామ‌న్నారు. వచ్చే 3 నుంచి 5 సంవత్సరాల్లో గృహ పరిష్కారాల వ్యాపారం ద్వారా రూ. 1,000 కోట్ల ఆదాయాన్ని సృష్టించాలని త‌మకు తాము లక్ష్యంగా నిర్ణయించుకున్నామ‌న్నారు. ఈ దిశగా, త‌మ వినియోగదారుల టచ్‌పాయింట్స్ నిర్మాణంలో, మైహోమ్ స్టోర్స్ ప్రారంభంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నామ‌న్నారు. తాము ఇప్పటికే చెన్నై, కొచ్చి, ముంబాయిల్లో స్టోర్స్ ప్రారంభించామ‌ని, ఇక్కడ హైదరాబాద్‌లో కూడా ప్రారంభిస్తున్నామ‌న్నారు. గృహ, నిర్మాణ రంగంలో 2022-2023 ఆర్థిక సంవత్సరాల మధ్య భారతదేశంలో రూ. 2,500 కోట్లకు పైగా సెయింట్-గోబైన్ పెట్టుబడి పెడుతుందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement