వరంగల్ క్రైమ్ (ప్రభ న్యూస్) : గంజాయితో లభించే మత్తు, మైఫిల్ వారికి సంతృప్తి నివ్వడం లేదు. క్విక్ కిక్ ను వారు కోరుకున్నారు. అందుకై గంజాయి వలే ఆలస్యంగా ఇచ్చే మత్తు కాకుండా ఇనిస్టెంట్ గా కిక్ ఇచ్చే డ్రగ్స్ కోసం వేట మొదలు పెట్టారు. మత్తు మాయ ప్రపంచంలోని మిత్రులతో ఆరా తీసి, చివరకు గోవాలో వారు కోరుకున్న ఎండిఎంఏ డ్రగ్ పిల్స్ ను నేరుగా నోట్లో వేసుకొని, ఇమ్మిడిటీయేట్ కిక్ మైఫిల్ లో భారీ సౌండ్స్ మధ్య డాన్స్ లు చేస్తూ, తెగ ఎంజాయ్ చేయడానికి అలవాటు పడ్డారు. అంతటితో ఆగకుండా అమ్మాయిలకు సైతం అలవాటు చేసి, వారి జీవితాలతో చేలాగాటమాడుతున్న ముఠా గుట్టును వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని టాస్క్ ఫోర్స్ పోలీసులు కనుగొన్నారు.
గోవాకే పరిమితమైన క్విక్ కిక్ బీజాలు ఓరుగల్లు మహానగరానికి పాకడం ఆందోళన కలిగిస్తోంది. డ్రగ్స్ ,గంజాయి విక్రయాలు
వినియోగంపై వరంగల్ టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ సి హెచ్ శ్రీనివాస్ నీకు విశ్వసనీయ సమాచారం అందుకొన్నారు. పక్కా సమాచారం మేరకు పోలీస్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ అధికారులు, హన్మకొండ పోలీసులతో కలిసి పోచమ్మకుంట, ప్రేమ్‌నగర్ కాలనీలోని ఎండి. మహమ్మద్ వో రహమతుల్లా (21) ఇంటిపై దాడి చేశారు. డిప్లొమా (మెకానికల్) చదివిన మహమ్మద్ వో రహమతుల్లా మల్టీ నేషనల్ కంపెనీ అయిన విబిఐటి జాంగోవన్ లో మెకానిక్ ఇన్ విన్ మోటార్స్ గా పని చేస్తున్నాడు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీకి చెందిన దశకరి ప్రవీణ్ లక్కీ అలియాస్ నాగరాజు(21) డిప్లొమా (మెకానికల్) చదివే వీరిద్దరూ హన్మకొండ ప్రేమనగర్‌లో ఉంటున్నారు. ములుగు జిల్లా జాకారంకు చెందిన కారు డ్రైవర్ మహ్మద్ హుస్సేన్(22), మహ్మద్ నిజాముద్దీన్(23), ములుగుకు చెందిన మహమ్మద్ సయ్యద్(30) లను అరెస్ట్ చేశారు.
గంజాయి విక్రయాలు, వినియోగంలో మునిగితేలుతూ ఎం డి ఎం ఏ (మెథైలిన్ డయోక్సిన్ మెథంఫెటమైన్ ఎక్స్టాసీ )2 ఎం డి ఎమ్ ఏ పిల్స్, కిలోన్నర గంజాయి 7 స్మార్ట్ ఫోన్లు,ఒక బజాజ్ పల్సర్ వెహికిల్ ను స్వాధీనం చేసుకున్నారు. 2018 నుండి కామన్ ఫ్రెండ్స్ అయిన వీరంతా గంజాయి మత్తులో మునిగి తేలుతున్నారు. గంజాయి తాగే అలవాటు ఉన్న వారంతా గోవాలో డ్రగ్స్ పెడ్లర్‌గా పేరుగాంచిన బాబాబాబుతో పరిచయం ఏర్పరుచుకొని, ఎండీఎంఏ కొనుగోలు చేసిన్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసుల విచారణలో తేలింది. బాబాబాబు ద్వారా నేరుగా వీలు గాకపోతే కొరియర్ ద్వారా దిగుమతి చేసుకొంటూ క్విక్ కిక్ కు పూర్తిగా అలవాటు పడ్డారు.