Saturday, November 23, 2024

ఈ నెఖరుకు పది ఫలితాలు.. టెన్త్‌లో ఈసారి కూడా గ్రేడింగే

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పదో తరగతి ఫలితాల్లో ఈసారి కూడా గ్రేడింగ్‌ విధానాన్నే అమలు చేయ‌నున్నారు. 2011 నుంచి రాష్ట్రంలో గ్రేడింగ్‌ విధానాన్నే కొనసాగిస్తున్నారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందు కు ఈ గ్రేడింగ్‌ విధానాన్ని అప్పట్లో ప్రవేశపెట్టారు అయితే ఏపీలో గ్రేడింగ్‌ విధానాన్ని తీసేసి మార్కుల ద్వారా ఫలితాలను ప్రకటిస్తుండటంతో తెలంగాణలో ఈసారి ఫలితాలు ఎలా ప్రకటిస్తారనే దానిపై చర్చ జరుగుతోంది. ఈక్రమంలోనే తెలంగాణలో గ్రేడింగ్‌ విధానంలోనే ఫలితాలు ఉంటాయని స్పష్టం చేశారు అధికారులు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేపడుతున్నారు. అయితే ఈ ఫలితాలు ఎలా ఉండబోతాయోనని అధికారులను కలవరపడుతున్నారు. ప్రస్తుతం జవాబు పత్రాల మూల్యాంకనాన్ని చేపడుతున్నారు అధికారులు.

ఈనెల 11న పది పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి కానుంది. ఆ తర్వాత ఫలితాల ప్రక్రియపై అధికారులు దృష్టి సారించనున్నారు. అయితే ఎప్పుడూ ప్రకటించిన తరహాలోనే ఈ సారి కూడా పదో తరగతి ఫలితాలను గ్రేడింగ్‌ విధానంలోనే వెల్లడిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు స్పష్టం చేశారు. ఈనెల చివరిన ఫలితాలను ప్రకటించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మే 23న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ఈనెల 1న ముగిశాయి. మొత్తం 5.08,143 మంది విద్యార్థుల్లో దాదాపు 5.03 లక్షలకు పైగా విద్యార్థులు పది పరీక్షలు రాసారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement