గవర్నర్ తక్షణమే తన అధికారాలను ఉపయోగించుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సూచించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఢిల్లీ పర్యటనతో కీలక అంశాలు చర్చకు వచ్చాయన్నారు. రాష్ట్ర విభజన చట్టం ద్వారా ఏ రాష్ట్ర గవర్నర్‌కు లేని అధికారాలు.. తెలంగాణ గవర్నర్‌కు ఉన్నాయని గుర్తుచేశారు. కుటుంబంలో ఉన్న సమస్యలను తప్పించుకునేందుకు.. కేసీఆర్ గవర్నర్‌ను సాకుగా చూపుతున్నారన్నారు. కేటీఆర్ తనను సీఎం చేయాలని కేసీఆర్‌పై ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. గవర్నర్‌తో సఖ్యత లేనప్పుడు కేటీఆర్‌ను సీఎం చేయడం కష్టమని.. కేసీఆర్ కుటుంబ సభ్యులతో చెబుతున్నారన్నారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారంటే.. తెలంగాణలో వైద్యం పడకేసినట్లే కదా ? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కుక్కలు, పిల్లులు, ఎలుకలు పెత్తనం చెలాయిస్తున్నాయని ఎద్దేవా చేశారు. వర్సిటీల్లో ఖాళీలున్నాయని గవర్నర్ అఫీషియల్‌గా నివేదిక ఇచ్చిందని రేవంత్‌రెడ్డి తెలిపారు. రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఎందుకు రాలేదు ? కేసీఆర్‌కు కోపం వస్తుందనే కిషన్‌రెడ్డి, సంజయ్ రాలేదని అని రేవంత్‌రెడ్డి అన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement