Thursday, November 21, 2024

మ‌ద్యం ధ‌ర‌లు త‌గ్గించ‌నున్న ప్ర‌భుత్వం.. ఇక మందుబాబుల‌కు నిత్యం పండుగే..

తెలంగాణ‌లో మందుబాబులకు గుడ్ న్యూస్ త్వరలోనే అందనుంది. రాష్ట్రంలో మద్యం రెట్లు తగ్గించేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది.. కరోనా కారణంగా గతంలో మద్యం రేటు 20 శాతం వరకు ప్రభుత్వం పెంచింది.. పెరిగిన ధరలతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే మద్యానికి కాస్త డిమాండ్ కూడా తగ్గింది. ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం సప్లై పెంచే దిశగా ఆబ్కారీ శాఖ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే మద్యం రేట్లను తగ్గించడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.. ఇటీవల కాలంలో బీర్ల అమ్మకాలు తగ్గడంతో.. ఒక్కో బాటిల్‌పై 10 రూపాయలు తగ్గించింది ప్రభుత్వం..

కానీ, లిక్కర్ బాటిల్‌పై ధర మాత్రం తగ్గించలేదు.. అందువల్ల బీర్లు మినహా ఇండియా మేడ్ లిక్కర్‌ (ఐఎండీ) పై స్వల్పంగా ధరలు తగ్గించనున్నట్లు తెలిసింది.. ధరల తగ్గింపుపై ఇప్పటికే ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపించినట్లు సమాచారం. దీనికి ఆమోదం తెలిపితే.. కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి దాకా రూ.28 వేల కోట్ల దాకా అమ్మకాలు జరిగాయి.. మొత్తంగా రూ.30 వేల కోట్లు వచ్చే అవకాశముంది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.33 వేల కోట్లను లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement