Saturday, November 16, 2024

HYD: హైడ్రా పేరుతో ప్రభుత్వం హైడ్రామా… ఈటల

అల్వాల్: హైడ్రా పై అల్వాల్ లో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వ పనితీరు తెలుసుకోవడానికి ఆరేళ్ల సమయం పడితే… రేవంత్ రెడ్డి పాలన తెలుసుకోవడానికి కేవలం ఆరు నెలల్లోనే తెలిసిపోయిందన్నారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం హైడ్రామా చేస్తుందన్నారు.

ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా లక్షల కోట్లు పెట్టి మూసీ సుందరీకరణ చేస్తానంటూ, స్థానికుల గూడు చెదరగొట్టే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుందని మండిపడ్డారు. అల్వాల్ జొన్న బండలో ఏడు దశాబ్ద కాలాల నుండి, ఉన్న వడ్డెర వర్గానికి చెందిన వారికి నోటీసులు ఇచ్చి ప్రభుత్వం భయభ్రాంతులకు గురి చేస్తుందని, ఈ నోటీసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, తాను అండగా ఉంటానని అక్కడ ఉన్న వారికి హామీ ఇచ్చారు.

శని, ఆదివారాలు, సెలవు దినాలు చూసుకుని నిజాం సర్కార్ కంటే దుర్మార్గంగా కూల్చివేతలు నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల కోసమే ఉంటది, ఇందిరమ్మ ఇల్లు కట్టించామని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ, పేదలు కట్టుకున్న ఇళ్లకు ఎమ్మార్వో లతో నోటీసులు ఇప్పించడం బాధాకరమని ఈటల రాజేందర్ తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement