Sunday, November 3, 2024

TS : రాష్ట్రంలో అగమ్యగోచరంగా పాలన… జ‌గ‌దీష్ రెడ్డి

న‌ల్గొండ : రాష్ట్రంలో పాల‌న అగ‌మ్య‌గోచ‌రంగా త‌యారైంద‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జ‌గ‌దీష్ రెడ్డి అన్నారు. న‌ల్గొండ జిల్లా దేవ‌ర‌కొండ‌లో నియోజ‌క‌వ‌ర్గ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ…. పంటలు ఎండిపోయి అన్నదాతలు ఆగమ‌య్యార‌న్నారు. కాంగ్రెస్ హామీలు నమ్మి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పి కాంగ్రెస్ నేతలు పెద్ద మోసం చేశారన్నారు. కేసీఆర్ నల్గొండలో సభ పెడితే భయపడి కాంగ్రెస్ వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేశారన్నారు. పంటలు ఎండిపోతే ఎవ్వరూ పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ వాళ్లు ఓట్లు దండుకొని, ఇప్పుడు మొఖం చాటేశారన్నారు. రుణమాఫీ చేయకపోవడంతో అన్నదాతలు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్దకు పోతున్నారన్నారు. 500 బోనస్ ఇస్తామ‌ని మోసం చేశారన్నారు. వీటన్నింటిపై కేసీఆర్ ప్రజల తరపున కొట్లాడుతున్నారన్నారు.


200 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారు… అయినా ప్రభుత్వంకు చలనం లేదన్నారు. మంత్రి కోమటిరెడ్డి ప‌నికిరాని మాటలు మాటలు మాట్లాడుతున్నాడన్నారు. కేసీఆర్ బయటికి రాగానే కాంగ్రెస్ వాళ్ల‌ లాగులు తడిశాయన్నారు. కాళేశ్వరం మోటర్లను ఆన్ చేశారన్నారు. నాగార్జున సాగర్ కింద నీళ్లు ఇచ్చే అవకాశం వున్నా ఇవ్వలేదన్నారు. రేవంత్ రెడ్డి జేబు దొంగ లాగా మాట్లాడుతున్నాడన్నారు. మంత్రులు దద్దమ్మలు… అందుకే కాలం తిరగబడింది… కరువు వచ్చిందన్నారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కుట్ర అంటూ అన్ని ఫేక్ న్యూస్ లే.. అభూతకల్పనలు కల్పిస్తూ కాంగ్రెస్ వాళ్లు ప్రచారo చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ వాళ్లు కేసీఆర్ ను ఏమీ చేయ‌లేర‌ని జ‌గ‌దీష్ రెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement