నవీపేట: ఓ వ్యక్తి తిరుపతి వెళ్తున్న రైలుకు ఎదురుగా ద్విచక్రవాహనంపై దూసుకెళ్లాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం దర్యపూర్ రైల్వేగేట్ వద్ద చోటు చేసుకుంది..గేట్ కీపర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి నవీపేట స్టేషన్‌మాస్టర్‌కు సమాచారం అందించారు.
ఆయన లోకోపైలట్‌కు విషయం చెప్పడంతో రైలు నిలిపివేశారు. దీంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ప్రాణం నిలబడింది. బైక్‌ను నడిపిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో అరగంట పాటు రైలును అక్కడే నిలిపేశారు.. ఆర్పీఎఫ్ పోలీసులు వాహనదారుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం నిజామాబాద్ కార్యాలయానికి తరలించారు..
- Advertisement -