- జిల్లాలో 23వేల మంది విద్యార్థులకు షూ పంపిణీ
- గుడ్ టచ్.. బ్యాడ్ పై విద్యార్థుల రోల్ ప్లే
- రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
ఉమ్మడి కరీంనగర్ బ్యూరో (ఆంధ్రప్రభ ) : దేశ భవిష్యత్తు విద్యార్థులపైనే ఆధారపడి ఉందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. చిగురు మామిడి మండలం చిన్న మల్కనూరు మోడల్ స్కూల్, జూనియర్ కాలేజీలో విద్యార్థులకు షూస్ పంపిణీ చేశారు. మోడల్ స్కూల్ లో విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గుడ్ టచ్.. బ్యాడ్ పై విద్యార్థుల రోల్ ప్లే ను వీక్షించారు. ముల్కనూరు మోడల్ స్కూల్ లో విద్యార్థులకు షూస్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది.
కరీంనగర్ జిల్లాలో 23వేల మంది విద్యార్థులకు షూస్ పంపిణీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పాఠశాల ప్రభుత్వం ప్రజలపాలనలో పార్లమెంట్ ఎన్నికలకు ముందు వేసవి సెలవులకు ముందే పాఠశాలలో మార్పు తేవాలనే ఉద్దేశంతో అమ్మ ఆదర్శ పాఠశాలల కింద అన్ని పాఠశాలలో మౌలిక వసతులు కల్పించామన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 25వేల పాఠశాలల్లో 1100 కోట్లతో మౌలిక వసతులు కల్పించామన్నారు. మోడల్ స్కూల్ లో 11సంవత్సరాల తరువాత ట్రాన్సఫర్ జరిగిందన్నారు.. 19వేల మంది ఉపాద్యాయులకు ప్రమోషన్లు, 35వేల మందికి బదిలీలు చేపట్టామన్నారు.
శానిటేషన్ సిబ్బంది కోసం నిధులు కేటాయిస్తున్నామన్నారు. ఉచిత విద్యుత్, డ్రింకింగ్ వాటర్ అందిస్తున్నామన్నారు. అన్ని గురుకులాల అద్దె చెల్లించామన్నారు. దేశానికి పరిపక్వత కలిగిన యువతను అందించాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. మన జిల్లా నుండి ప్రాతినిథ్యం వహించిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 14 భాషల్లో మాట్లాడారు.. మీరు కూడా ఇంగ్లీష్, హిందీ ఇతర భాషలు కూడా నేర్చుకోవాలన్నారు. కష్టపడి తల్లిదండ్రులకు పేరు తేవాలి.. మీ గ్రామానికి, మీ జిల్లాకు పేరు తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రపూల్ దేశాయ్, ఆర్డీవో మహేష్, డీఈవో జనార్ధన్, ఎంఈవో పావని, ఇతర విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు.