Saturday, November 23, 2024

ఎయిడెడ్ స్కూళ్లపై పోరాటం కొనసాగుతుంది..

అమరావతి, (ప్ర‌భ‌న్యూస్): ఎయిడెడ్‌ విద్యాసంస్థలను ప్రభుత్వంలో ఇప్పటికే విలీనానికి విల్లింగ్‌ ఇచ్చిన యాజమాన్యాలు తమ విల్లింగ్‌ను వెనక్కి తీసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం పట్ల ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు, కె.కులశేఖరరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది విద్యార్థి, తల్లిదండ్రుల, ఉపాధ్యాయ సంఘాల ఉద్యమ విజయమని అన్నారు. అయితే ఎయిడెడ్‌ యాజమాన్యాలు తమ విద్యాసంస్థలను ప్రైవేట్‌ విద్యా సంస్థలుగా మార్చుకోవడానికి ఇచ్చిన ఆప్షన్‌ 42, 50 ఉత్తర్వుల ద్వారా ఇంకా కొనసాగు తుందని తెలిపారు.

పేద, బడుగు బలహీనర్గాలకు చెందిన విద్యార్థులు ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదువుతున్నారని, ఎయిడెడ్‌ విద్యా సంస్థలలో 2004 సంవత్సరంలో నియామకాల నిషేధంపై ఇచ్చిన జీవో 35 ను రద్దు చేసి ఎయిడెడ్‌ విద్యాసంస్థల అభివృద్ధి-కై- టీ-చర్స్‌ నియామకాలు చేపట్టి విద్యార్థులకు ఉచిత విద్య అవకాశాలను వివరించాలని ఏపీటీఎఫ్‌ డిమాండ్‌ చేస్తోందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement