Thursday, November 21, 2024

HYD: తెలంగాణ హాస్పిటల్స్ లోని సౌకర్యాలు ఎక్కడా లేవు.. శ్రీలత శోభన్ రెడ్డి

హైదరాబాద్ : తెలంగాణలో ఉన్న హాస్పిటల్స్ లో ఉన్న సదుపాయాలు మరెక్కడా లేవని గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ హెచ్1 (బి ఆర్ టి యు) రాష్ట్ర కార్యాలయాన్ని హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రావు, బీఆర్ఎస్ కార్మిక విభాగ అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి తో కలిసి నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ… అలాగే కరోనా కష్టకాలంలో కూడా తెలంగాణ ప్రభుత్వం సామాన్య ప్రజలకు, కరోనా బారిన పడిన పేషెంట్లకు వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలను అందించారన్నారు. ఆశా వర్కర్లు చేసిన సేవలు కూడా మరువలేమన్నారు. అలాగే ప్రభుత్వం ఆశా వర్కర్లకు, వైద్య సిబ్బందికి అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. ప్రజా వైద్య ఉద్యోగ సంఘాల సభ్యులకు అభినందలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ టీ యూనియన్ అధ్యక్షుడు కే సాయి రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు శివకుమార్, రాంబాబు యాదవ్, రూప్ సింగ్, నారాయణ, ప్రథమ రెడ్డి, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement