Friday, December 13, 2024

TG | ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని ఎండగట్టాలి.. మంత్రి సీతక్క

బాసర, డిసెంబర్ 13 ఆంధ్రప్రభ : ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ర్పచారాన్ని ఎక్కడికక్కడ గ్రామాల్లో ఎండగట్టాలని మంత్రి సీతక్క కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా ఇన్చార్జి మంత్రి ధనసరి అనసూయ సీతక్క జిల్లా పర్యటనలో భాగంగా బాసరలోని జీఎస్ గార్డెన్ లో కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. జిల్లాకు చేరుకున్న ఇంచార్జ్ మంత్రి సీతక్కను మాజీ ఎమ్మెల్యేలు విఠ‌ల్ రెడ్డి, నారాయణరావు పటేల్ ఘన స్వాగతం పలికారు.

రైతు భరోసాను ప్రభుత్వం తప్పక అందిస్తుందని, ప్రతిపక్ష పార్టీలు కావాలని రైతు భరోసాపై దుష్ప్రచారాన్ని చేపడుతున్నాయని రైతులు నమ్మొద్దన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు చేస్తున్న దుష్ట ప్రచారాన్ని కార్యకర్తలు ఎక్కడికక్కడ ఎండగట్టాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిన అంశాన్ని విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని, వరి రైతులకు అందిస్తున్న 500రూపాయల బోనస్, 200 యూనిట్ల కరెంటు మాఫీ, ఉచిత బస్సు, పథకాలను అందిస్తున్నాట్లు మంత్రి తెలిపారు.

నిర్మల్ జిల్లాలోని దిల్వాల్ పూర్ లో ఇత్తనాలు ఫ్యాక్టరీకి అనుమతులను గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందని, కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు రైతులను రెచ్చగొట్టి ఉసిగొల్పుతున్నార‌న్నారు. ప్రభుత్వం అభివృద్ధి పనులను ముమ్మరం చేస్తుందని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు విఠ‌ల్ రెడ్డి, నారాయణరావు పటేల్, త్రిబుల్ ఐటీ, బాసర ఆలయ అభివృద్ధి పరచాలని అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement