Friday, November 22, 2024

కవితకు ఈడీ నోటీసు కక్ష సాధింపు చర్య… గద్వాల్ విజయలక్ష్మీ

ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసు ఇవ్వడంపై నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ స్పందించారు. ఇది ఒక కక్ష సాధింపు చర్య, దుర్మార్గపు చర్య అన్నారు. లిక్కర్ స్కాం పేరిట బీజేపీ నాటకాలు ఆడుతోందన్నారు. మోడీ విధానాలు ఎమర్జెన్సీ కన్నా దారుణంగా ఉన్నాయన్నారు. బీజేపీ దర్యాప్తు సంస్థలను ప్రతిపక్షాలను వేధించేందుకు వాడుకోవడం సిగ్గు చేటన్నారు. ఈ డ్రామాను ప్రజలు తిప్పి కొట్టాలన్నారు. కవిత బీఆర్ఎస్ పార్టీ విస్తరణలో క్రియాశీలంగా ఉన్నందుకే బీజేపీ కక్ష కట్టిందన్నారు.
నేతలు విచారణకు సహకరిస్తుంటే ఈ నోటీసులు, బెదిరింపులు, అరెస్టులు దేనికని,..సీబీఐ, ఈడీల విచారణ తీరు సరిగా లేదన్నారు. తప్పుడు కేసులు బనాయిస్తున్న బీజేపీకి తెలంగాణ తగిన గుణపాఠం చెబుతుందన్నారు. కవితకు అందరూ అండగా ఉంటారన్నారు. ఢిల్లీలో మహిళ హక్కుల రక్షణకు, రిజర్వేషన్ల కై ఉద్యమిస్తున్న సమయంలో ఇటువంటి చర్యలు దురదృష్టకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా పారదర్శక పద్దతిలో విచారణ చేపట్టి ప్రతిపక్ష నేతలను వేధించడం మానాలని మేయర్ విజయలక్ష్మీ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement