నేటి నుంచి ఈ నెల 14వరకు మునుగోడు ఉప ఎన్నికకి నామినేషన్లు స్వీకరించనున్నారు.ఈ మేరకు నోటిఫికేషన్ ని ఈసీ విడుదల చేసింది.కాగా అక్టోబర్ 17 వరకు నామినేషన్లు పరిశీలించనున్నారు. అక్టోబర్ 17 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. నవంబర్ 3న పోలింగ్, నవంబర్ 6న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ ..బిజెపి పార్టీలతో అభ్యర్థులను ప్రకటించి ఉపఎన్నికకు సిద్ధమయ్యాయి. కానీ అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం… ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించలేదు. ఇవాళ ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం . అధికార టీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే ఆయన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని బరిలో దింపే ఛాన్స్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అటు కాంగ్రెస్ పార్టీ తరఫున పాల్వాయి స్రవంతి.. బిజెపి తరఫున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో ఉన్న సంగతి తెలిసిందే.
మునుగోడు ఉప ఎన్నికకి -నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ
By Maha Laxmi
Previous article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement