Saturday, September 14, 2024

TG: రైతుల అభిప్రాయం మేరకే నిర్ణయం.. భరోసాపై ఉప ముఖ్యమంత్రి భట్టి

హన్మకొండ కలెక్టరేట్, జులై 15 (ప్రభ న్యూస్) : రైతుల అభిప్రాయం మేర‌కే రైతు భ‌రోసాపై నిర్ణయం ఉంటుందని మంత్రివ‌ర్గ ఉప‌సంఘం చైర్మ‌న్, ఉప ముఖ్యమంత్రి మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క అన్నారు. హన్మకొండ కలెక్టరేట్ లోని ఐడీఓసీ సమావేశ మందిరంలో సోమవారం రైతు భరోసా పథకం విధి విధానాలపై నిర్వహిస్తున్న ఉమ్మ‌డి వరంగల్ జిల్లా కార్య‌శాల (వ‌ర్క్ షాప్)లో ముఖ్య అతిధిగా మంత్రివ‌ర్గ ఉప‌సంఘం చైర్మ‌న్, ఉప ముఖ్యమంత్రి మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క పాల్గొన్నారు.

ఆయనతో పాటు స‌భ్యులైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు, ఉమ్మ‌డి వరంగల్ జిల్లా ఇంచార్ట్, రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సితక్క, ఎంపీలు బలరాం నాయక్, డాక్టర్ కడియం కావ్య, రాష్ట్ర ప్రభుత్వ విప్ రాంచంద్రు నాయక్, ఎం ఎల్ సి బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే లు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, దొంతి మాధవ రెడ్డి, రేవురి ప్రకాష్ రెడ్డి, కె ఆర్ నాగరాజు, యశశ్విని రెడ్డి, గండ్ర సత్యనారాయణ, మురళి నాయక్, కార్పొరేషన్ల చైర్మన్లు, ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు, ఆదనవు కలెక్టర్లు, వ్యవసాయ శాఖ, సంబంధిత శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు భరోసా విధివిధానాలపై రైతులు, రైతు సంఘాలు, ప్ర‌జాప్ర‌తినిధులు, ఇత‌ర వ‌ర్గాల నుంచి మంత్రివ‌ర్గ ఉపసంఘం అభిప్రాయాలను సేకరిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement