Friday, November 22, 2024

కన్న ప్రేమే కాదు… పెంచిన ప్రేమ కూడా గొప్పదే

కన్నప్రేమే కాదు పెంచిన ప్రేమ కూడ గొప్పదని చాటారు ఆ భార్యాభర్తలు. కంటికి రెప్పలా పెంచి పెద్ద చేసి కన్యాదానం చేసి కన్నీరు పరియంతమైయ్యారు ఆశ్రమ నిర్వాహకులు. అవును మీరు వింటున్నది నిజమే.పెద్దపల్లి జిల్లా రామగుండం తబితా ఆశ్రమనికి చెందిన అనాధ అమ్మాయి విజయలక్ష్మీ ని హైదరాబాద్ కు చెందిన వ్యాపారి అనీల్ జవర్ తో అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. గత పదిహేను సంవత్సరాల క్రితం ఏడేళ్ల వయసులో ఆశ్రమానికి వచ్చిన అమ్మాయి విజయలక్ష్మి ని సొంత బిడ్డల పెంచి పెద్దచేశారు వీరేంద్ర నాయక్ దంపతులు.

హైదరాబాద్ లో చిరు వ్యాపారం చేస్తున్న అనీల్ జవర్ తో పెళ్లి నిచ్ఛయించి సోమవారం గోదావరిఖని లయన్స్ క్లబ్ లో లయన్స్ మెంబర్స్ సౌజన్యంతో దాతల సహకారం తో వివాహం జరిపించారు. ఇందుకోసం దాతలు తోచిన ఆర్థిక సహాయాన్ని అందించి వధూవరుల ను ఆశీర్వదించారు. వివాహ కార్యక్రమనికి సహకరించిన దాతలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఆశ్రమ నిర్వాహకుడు వీరేంద్ర నాయక్.

Advertisement

తాజా వార్తలు

Advertisement