హైదరాబాద్ టూరిజం ప్లాజాలో జరిగిన సమావేశానికి కౌన్సిల్ ఛైర్మన్, మంత్రి కమలాకర్ అధ్యక్షత వహించగా, సంఘం గౌరవాధ్యక్షులు, ఎంపీ రవిచంద్ర, తదితర ప్రముఖులు హాజరయ్యారు. మున్నూరుకాపు సంఘం తెలంగాణ రాష్ట్రం అపెక్స్ కౌన్సిల్ (అత్యున్నత స్థాయి కమిటీ) సమావేశం హైదరాబాద్ నగరంలోని టూరిజం ప్లాజాలో శనివారం ఉదయం జరిగింది. కౌన్సిల్ ఛైర్మన్, మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన సుమారు మూడు గంటల పాటు జరిగింది.
ఈ సమావేశంలో సంఘం గౌరవాధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, అధ్యక్షులు కొండా దేవయ్య, కన్వీనర్ బాలకిషన్ రావు, కౌన్సిల్ సభ్యులు సి.విఠల్, గాలి అనిల్ కుమార్, పూల రవీందర్, ఆకుల లలిత, మెట్టు శ్రీనివాస్, చల్లా హరిశంకర్, సర్థార్ పుట్టం పురుషోత్తం, ఎర్ర నాగేందర్, రౌతు కనకయ్య, తూడి ప్రవీణ్, ఊసా రఘు, మీసాల చంద్రయ్య, బుక్కా వేణుగోపాల్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘాన్ని ఐకమత్యంతో మరింత ముందుకు తీసుకుపోయేందుకు, కోకాపేటలో ప్రభుత్వం కేటాయించిన ఐదెకరాల స్థలంలో మున్నూరుకాపు భవన నిర్మాణం పనులను వెంటనే చేపట్టి వేగవంతంగా పూర్తి చేసేందుకు గాను పలు తీర్మానాలు చేశారు.