Tuesday, November 26, 2024

ADB: పత్తి విత్తనాల గోదాంలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్..

ఆంధ్రప్రభ బ్యూరో ఉమ్మడి ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల పరంపర కొన‌సాగుతుండ‌డంతో డిమాండ్ ఉన్న విత్తనాల కొరతతో రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షి షా ఆకస్మికంగా విత్తన గోదాంలను సందర్శించారు. పత్తి విత్తనాలు నిల్వ ఉన్న డిస్ట్రిబ్యూటరీ కేంద్రాలను, విత్తన డీలర్ల దుకాణాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి స్టాక్ వివరాలపై ఆరా తీశారు.

గురువారం పంజాబ్ చౌరస్తాలో నిఖిల్ ట్రేడర్స్ నుండి రాశి 659 రకం పత్తి విత్తనాలు దొడ్డిదారిన తరలిస్తుండగా రైతులు రోడ్డెక్కి ఆందోళన చేశారు. జిల్లా కలెక్టర్ స్వయంగా ఈ పరిణామాలను పరిశీలించి రైతులను మోసగించిన కేసులో విత్తనాల డిస్ట్రిబ్యూటర్ రాకేష్ రెడ్డిపై కేసు నమోదు చేసేలా చర్యలు తీసుకున్నారు. అయితే డిమాండ్ ఉన్న రాశి 659 రకం పత్తి విత్తనాలు నల్ల బజారుకు త‌రులుతున్నాయని వచ్చిన ఆరోపణల మేరకు జిల్లా కలెక్టర్ శుక్రవారం శ్రీనివాస ఫెర్టిలైజర్స్, బుక్తాపూర్ లోని దేశ్ముఖ్ విత్తనాల గోదాములను ఆకస్మికంగా సందర్శించి విత్తన ప్యాకెట్ల గురించి ఆరా తీశారు. పత్తి విత్తనాలను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement