Friday, November 22, 2024

మత సామరస్యానికి ప్రతీక భాగ్యనగరం.. పాత బస్తీలో సీటీ సీపీ ఇఫ్తార్​ విందు

హైదరాబాద్​ నగరంలో ప్రతి ఉత్సవం మతసామరస్యంతో కొనసాగుతూ చారిత్రక నేపథ్యాన్ని సొంతం చేసుకుందని హోంమంత్రి మహమూద్‌అలీ అన్నారు. సిటీ పోలీసుల ఆధ్వర్యంలో చారిత్రక చౌమహల్లా ప్యాలెస్‌లో ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, నగరంలో గంగా జమునా తెహజీబ్‌ సంగమంగా అనేక వర్గాలు జీవనం సాగిస్తున్నాయన్నారు. రంజాన్‌, దసరా, క్రిస్‌మస్‌ వేడుకలు ఏవైనా కలిసికట్టుగా జరుపుకుంటూ దేశవ్యాప్తంగా ప్రత్యేకతను చాటుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారికి సమ ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఏటా కానుకలను అందజేస్తోందని చెప్పారు.

నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్‌, ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌, వక్ఫ్‌ బోర్డు మాజీ చైర్మన్‌ మహ్మద్‌ సలీం, డీజీపీ మహేందర్‌రెడ్డి, అదనపు డీజీపీ అంజనీకుమార్‌, రైల్వే డీజీ సందీప్‌ శాండిల్య, జాయింట్‌ సీపీలు రంగానాథ్‌, డీఎస్‌ చౌహాన్‌, దక్షిణ మండల డీసీపీ సాయి చైతన్య, అదనపు డీసీపీ రఫీఖ్‌, ఏసీపీలు బిక్షంరెడ్డి, శివరామశర్మ, ఎండీ మాజీద్‌తోపాటు పలువురు మత పెద్దలు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement