Friday, November 22, 2024

ముగిసిన అట‌వీ శాఖ బ‌ర్డ్స్ వాక్..

కవ్వాల్‌ టైగర్‌ రిజర్వులో అటవీశాఖ నిర్వహించిన బర్డ్స్‌ వాక్‌ ముగిసింది. జన్నారం డివిజన్‌లో ఈనెల 12నుంచి 13వ తేదీ వరకు రెండు రోజుల పాటు నిర్వహించిన బర్డ్స్‌వాక్‌ లో తెలంగాణ సహా ఢిల్లి, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి 61 మంది పక్షుల ప్రేమికులు, ఫోటోగ్రాఫ‌ర్లు పాల్గొన్నారు. పక్షుల వీక్షణ సమయంలో గ్రే హెడ్డ్‌ ఫిష్‌ ఈగిల్‌, గద్వాల్‌ బాతులు, స్పాట్‌ బిల్డ్‌ బాతులు, బ్రెస్టెడ్‌ వాటర్‌ కోడి, బ్లాక్‌ డ్రాంగోలు, కింగ్‌ ఫిషర్స్‌ జక్కనా వంటి పావురాలు వంటి పక్షులను ఫోటోగ్రాఫ‌ర్లు తమ కెమెరాలతో క్లిక్ మ‌నిపించారు.

ఈ సందర్భంగా బర్డ్స్‌వాక్‌లో పాల్గొన్న వారి నుంచి ప్రకృతి పరిరక్షణపై అభిప్రాయాలను అటవీశాఖ అధికారులు సేకరించారు. అలాగే వారికి ధృవపత్రాలను అందజేశారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా పక్షుల వీక్షకులకు ఆవాసాలు, వన్యప్రాణుల నిర్వహణ గురించి అటవీశాఖ పీసీసీఎఫ్‌ ఆర్‌. శోభ, కవ్వాల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు వినోద్‌ కుమార్‌, ఇతర సీనియర్‌ అధికారులు వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement