Friday, November 29, 2024

WGL | రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం.. అంజయ్య

వాజేడు, నవంబరు 29 ఆంధ్రప్రభ : రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని వాజేడు సహకార సంఘ అధ్యక్షులు అంజయ్య అన్నారు. ప్రజా విజయోత్సవాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రైతులకు సంవత్సర కాలంలోనే రెండు లక్షల రూపు రుణమాఫీ చేయడం జరిగిందని, రాష్ట్రవ్యాప్తంగా 18వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ మేనని ఆయన అన్నారు.

కొన్ని కారణాల వలన కొంతమందికి రుణమాఫీ కాలేదని వారికి కూడా డిసెంబర్ 9 వరకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేస్తుందన్నారు. అదేవిధంగా రైతు పండించిన వరి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడమే కాక సన్న రకం ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇవ్వడం కూడా జరుగుతుందన్నారు. దళారులను ఆశ్రయించి మోసపోకుండా రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి అధిక లాభాలను పొందడమే కాక బోనస్ కూడా పొందాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షులు వత్సవాయి జగన్నాథరాజు కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కాకర్లపూడి విక్రాంత్ సొసైటీ సీఈవో సోమ సత్యనారాయణ ఏఈఓ జాఫర్ రికార్డర్ అసిస్టెంట్ వడ్లూరి వరప్రసాద్ కాంగ్రెస్ నాయకులు చెన్నై ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement