.. భువనగిరిలో పార్లమెంట్ స్థాయి నీటి పారుదల పనులపై సమీక్ష
..హాజరైన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి : తెలంగాణ రాష్ట్రాన్ని సస్య శ్యామలం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని భారీ నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు అన్నారు. శుక్రవారం భువనగిరి పట్టణ కేంద్రంలోని న్యూ డైమెన్షన్ (సువాలి ఎస్టేట్) లో భువనగిరి పార్లమెంట్ స్థాయి నీటి పారుదల శాఖ సమీక్ష సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
ఆయా నియోజకవర్గాల సాగునీటి కాల్వలపై సమీక్షించారు. ఈ సమావేశంలో విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఇరిగేషన్ శాఖ కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ రెడ్డి, వేముల వీరేశం, మందుల సామెల్, రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇరిగేషన్ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.